Ramcharan: ఫైర్ మీదున్నా.. తర్వాతి సవాల్‌కు సిద్ధం అంటున్న రామ్ చరణ్
రామ్ చరణ్ తాజా సినిమా పెద్ది కోసం చాలా కసరత్తు చేస్తున్నాడు. తన బాడీని జిమ్ లో కష్టపెడుతున్న ఫొటోలను ఈరోజు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా భారీ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. సంక్రాంతికి కొంత గేప్ ఇచ్చారు. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభంకానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా, భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఆయన కఠినంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటోలను పంచుకున్న చరణ్.. "ఫైర్ మీదున్నా... నిశ్శబ్దంగా పనిచేస్తున్నా. తర్వాతి సవాల్‌కు సిద్ధం" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా వుండగా, గత నెలలో ఢిల్లీ లో కీలక షెడ్యూల్ జరిగింది.. ఆ షెడ్యూల్‌లో పలు లొకేషన్లను వెతుకుంటూ రైల్ ట్రాక్ మీదుకూడా యాక్షన్ చేసినట్లు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వెల్లడించారు. అనంతరం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లో, ప్రముఖ స్టంట్ మాస్టర్ శామ్ కౌశల్ ఆధ్వర్యంలో కూడా కొన్ని సన్నివేశాలు తీశారు.
ఇక ఈ సినిమాకు వెంకట సతీష్ కిలారు నిర్మాత. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు మార్చి 27న సినిమా విడుదలకాబోతోంది.