బుధవారం, 5 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : బుధవారం, 5 నవంబరు 2025 (14:18 IST)

Ramcharan: ఎ.ఆర్. రెహమాన్.. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అదిరిపోయే ప్రోమో రిలీజ్

Ramcharan - Chikiri chikiri song
Ramcharan - Chikiri chikiri song
రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ పెద్ది షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రకు ప్రాణం పోసేందుకు రామ్ చరణ్ అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసింది.  
 
మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్- చికిరి చికిరి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో, దర్శకుడు బుచ్చి బాబు సానా, అకాడమీ అవార్డు విన్నింగ్ కంపోజర్ ఎ.ఆర్. రెహమాన్ పట్ల తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకుంటూ, పాట సందర్భాన్ని వివరిస్తూ ప్రారంభమవుతుంది. కొండల మధ్య నివసించే హీరో, ఒక అమ్మాయిని చూసిన వెంటనే  ఉప్పొంగే భావోద్వేగం సంగీతంగా, సంబరంగా వెలువడుతుందని సందర్భాన్ని వివరించారు.
 
హీరో అమ్మాయిని చికిరి.. అని పిలుచుకోవడం ఈ పాటకు ప్రాణం అయింది. రెహమాన్ సృష్టించిన హై వోల్టేజ్ బీట్‌లకు అనుగుణంగా రామ్ చరణ్ తన సిగ్నేచర్ మాస్ డాన్స్ స్టైల్‌, ఎనర్జీ తో అదరగొట్టారు. ఈ పాటలో చరణ్ హుక్‌స్టెప్ క్షణాల్లో వైరల్ అయ్యింది.  
 
నవంబర్ 7న విడుదల కాబోతున్న ‘చికిరి చికిరి’ లిరికల్ వీడియో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కాన్సెప్ట్ వీడియోతోనే ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెరిపోయింది. రెహమాన్ సంగీతం, చరణ్ స్టెప్స్, బుచ్చిబాబు మార్క్ తో ఈ ఆల్బమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, చరణ్ ప్రేమికురాలు‘చికిరి’గా కనిపించనుంది.  శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  
 
ఈ సినిమాకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు డీవోపీ కాగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్.
 
పెద్ది మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
 
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: బుచ్చిబాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్