బుధవారం, 29 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 అక్టోబరు 2025 (21:00 IST)

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Ram Charan And Upasana
Ram Charan And Upasana
సెలబ్రెటీ జ్యోతిష్యుడిగా పేరు పొందిన వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చుట్టూ జ్యోతిష్యం కోసం తిరిగే సెలెబ్రిటీలు చాలామంది వున్నారు. సెలెబ్రిటీలు.. వారి జీవితాల గురించి బహిరంగంగా కామెంట్లు చేసి వార్తల్లో నిలిచే వేణు స్వామిని ప్రస్తుతం ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. తాజాగా రామ్ చరణ్- ఉపాసనల పాప జ్యోతిష్యంలో వేణు స్వామిని ఆడుకుంటున్నారు అభిమానులు. 
 
రామ్ చరణ్- ఉపాసన రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే గుడ్ న్యూస్‌తో వేణు స్వామి జోస్యం మరోసారి తప్పిందని తెలుస్తోంది. క్లింకార తర్వాత రామ్ చరణ్ దంపతులకు సంతానమే ఉండరని చెప్పారు వేణు స్వామి. కానీ, చెర్రీ దంపతులు రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపారు. 
Upasana Konidela
Upasana Konidela
 
ఒక బిడ్డ కాదు ఈసారి ట్విన్ బేబీస్‌కి జన్మనివ్వబోతున్నారని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వేణు స్వామి జోస్యం మరోసారి తప్పింది అంటూ గతంలో చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా నెటిజన్లు, అభిమానులు ఇలాంటి అసత్యాలను పలకవద్దని వేణుస్వామి వార్నింగ్ ఇస్తున్నారు.