బుధవారం, 15 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Last Updated : మంగళవారం, 14 అక్టోబరు 2025 (14:17 IST)

Rashmika : రష్మిక మందన్నా కు ప్రేమ పెండ్లి వర్కవుట్ కాదంటున్న వేణు స్వామి

Vijay Deverakonda, Rashmika Mandanna, Venu Swamy
Vijay Deverakonda, Rashmika Mandanna, Venu Swamy
సినిమారంగంలో సినిమా ఓపెనింగ్స్ లకు ఒకప్పుడు వేణుస్వామిని పిలిచేవారు. పవన్ కళ్యాణ్ కూ జల్సా కు ముందు ముహూర్తపుం పెట్టాడు. ఇదంతా నిర్మాతల అంగీకారంతోనే జరుగుతుంది. అలాంటి వేణుస్వామి పలువురు సెలబ్రిటీల జీవితాలను బయటపెట్టి వారితో ఆడుకున్నాడనే విమర్శలు వచ్చాయి. సమంత, నాగచైతన్య వివాహం బెడిసికొడుతుందని గతంలో చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో కొత్త విషయాలు ఆయన బయటపెట్టాడు.
 
తాజాగా యావత్ దేశంలో హాట్ టాపిక్.. రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం. ఫిబ్రవరిలో పెండ్లి. ఈ విషయంలో వేణు స్వామి ఘాటుగా స్పందించారు. రష్మికకు ప్రేమ వివాహం అచ్చిరాదు అని తేల్చాడు. అలాగే విజయ్ దేవరకొండ కు ఇగో ఎక్కువగా వుంది. ఆమెకు అతను సూట్ కాడు అన్నారు.
 
గతంలో రష్మిక మందన్నా చాలా పూజలు వేణుస్వామితోనే చేయించింది. దీనిపై ఆయన స్పందిస్తూ... రష్మిక మందన్నా గతంలో పూజలు చేయించుకునేది. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు సరిగ్గా లేవుని చెప్పా. కానీ ఆమె అంగీకరించలేదు. దానితో భగవంతుడు ఆమెను ట్రాక్ తప్పిస్తున్నాడని అర్థమయింది. దేవుడు ఆమె కర్మ ఫలం అనుభవించాల్సింది కనుక నన్ను తప్పుకోమన్నాడనిపించింది. 
లవ్ ఎఫైర్ వద్దన్నా. చాలామందికి వున్న సమస్య లాగేా ఆమెకూ వుంది. 
 
భవిష్యత్ లో ఆమె నెంబర్ 1 స్థాయి నుంచి తగ్గుతుంది. ఎందుకంటే దేవుడిచ్చిన అద్రుష్టం కొంతకాలానికి వుంటుంది. ఆ తర్వాత వుండదు. అందుకే జాగ్రత్తపడాలి. కనుక ఏదైనా నేను చెప్పింది జరగలేదంటే.. నేను డిసెంబర్ లో ఇలా జరుగుతుంది అని చెబితే.. అది జూన్ లో జరగవచ్చు. కానీ జరగడం పక్కా. అంటూ పలు ఉదాహరణలు చెబుతున్నారు.. మరి విజయ్ దేవరకొండ, రష్మిక జాతకం ముందు ముందు ఎలావుంటుందో చూడాలి.