శుక్రవారం, 5 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 4 డిశెంబరు 2025 (12:43 IST)

పైరసీ చేసినందుకు చింతిస్తున్నా, వైజాగ్‌లో రెస్టారెంట్ పెడ్తా: ఐబొమ్మ రవి

i bomma ravi restaurent
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
వందలకోట్లతో నిర్మించిన చిత్రాలను పైరసీ చేసి నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిన ఐబొమ్మ రవి చింతిస్తున్నాడట. పైరసీ చేసినందుకు ఎంతో చింతిస్తున్నాను. నా తండ్రి మనోవేదన చెందేందుకు కారణమయ్యాననీ, ఇకపై మంచిదారిలో నడవాలనుకుంటున్నట్లు చెపుతున్నాడట. తనకు క్యాటరింగ్ మీద మంచి పట్టు వుందనీ, కేసుల నుంచి బైటపడిన తర్వాత హైదరాబాద్ లేదా విశాఖపట్టణంలో రెస్టారెంట్ ప్రారంభించాలనుకుంటున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
 
ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు అతడు మాట్లాడిన దానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని అధికారులు చెపుతున్నారు. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడట. తన తండ్రి వద్దకు వెళ్లి అక్కడే ఏదో రెస్టారెంట్ ప్రారంభించి జీవితాన్ని సాగిస్తానని వెల్లడించినట్లు చెబుతున్నారు.