బుధవారం, 3 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవి
Last Updated : మంగళవారం, 2 డిశెంబరు 2025 (14:19 IST)

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Prabhas and Sandeep reddy vanga
Prabhas and Sandeep reddy vanga
ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమా స్పిరిట్ ఇటీవలే షూటింగ్ మొదలైంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్యం వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓల్డ్ సిటీపరిసరాల్లో షూటింగ్ జరుగుతుంది.ప్రభాస్ పోలీస్ గెటప్ లో కనిపిస్తున్న ఫోటో బయటకు వచ్చింది. గత రెండు రోజులుగా యాక్షన్ సీన్స్ తీస్తున్నారు.
 
జైలు ఖైదీలు ప్రభాస్ పై అటాక్ చేసే సన్నివేశాలను తీస్తున్నట్లు తెలిసింది. ఖైదీలుగా ఫైటర్స్ నటిస్తున్నారు. అందుకే నాచురల్ గా సీన్స్ వస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా షూటింగ్ లో ఫోన్లు నిషిద్దం అయినా ఎవరో తెసిన ఫోటో సోషల్ మీడియాలో వచ్చింది. ఇది గదరా మాకు సందడి అంటూ ప్రభాస్ అభిమానులు స్పందిస్తున్నారు. 
 
ఇది ఇలా ఉండగా షూటింగ్ దగ్గరకు ఓటీటీ కి చెందిన వారు వచ్చి ఈ సినిమా ఓటీటీ డీల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి భారీ మొత్తంలోనే ఈ డీల్ అన్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్రభాస్, సందీప్ ను బేస్ చేకుకుని 160 కోట్ల డీల్ అంటేనే నమ్మశక్యంగా లేదు. గతంలో కల్కి 2898 ఎడి కేవలం హిందీ ఓటీటీ డీల్ నే 170 కోట్లకి పైగా పలికింది. కనుక. అసలు డీల్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.