సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (12:17 IST)

జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కానిస్టేబుల్ మృతి

police
సికింద్రాబాద్‌లోని జిమ్‌లో విశాల్ అనే 24 ఏళ్ల కానిస్టేబుల్ వ్యాయామం చేస్తూ మరణించాడు. వ్యాయామం చేస్తూ.. 24 ఏళ్ల కానిస్టేబుల్ వ్యాయామం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధ్రువీకరించారు. 
 
వ్యాయామం చేస్తూ జిమ్ ఫ్లోర్‌లో కుప్పకూలిపోయాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఈ తతంగమంతా జిమ్‌లోని సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
మోండా మార్కెట్ ప్రాంతంలోని ఘాన్సీ బజార్‌లో నివాసం ఉంటూ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విశాల్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 
 
సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ఉన్న జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో గుండెపోటుకు గురైనట్లు పోలీసులు తెలిపారు.