ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (10:33 IST)

హైదరాబాద్ లిక్కర్ షాపులో దొంగలు.. రూ.2లక్షలు కొట్టేశారు..

హైదరాబాద్ లిక్కర్ షాపులో దొంగలు పడ్డారు. హైదరాబాద్ శామీర్‌పేట మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో కాల్పుల ఘటన సంచలనానికి దారి తీసింది. 
 
వివరాల్లోకి వెళితే.. దుండగులు గాలిలో మూడుసార్లు కాల్పులు జరిపి దుకాణంలో ఉన్న రూ. 2 లక్షలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
సోమవారం రాత్రి ఈ ఘటన జరగ్గా, పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమేయం ఉన్న వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. షాపు యజమాని బాలకృష్ణ, జైపాల్ రెడ్డి అనే ఉద్యోగిపై కూడా మంకీ క్యాప్ ధరించి వచ్చిన నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. 
 
నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.