శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (17:07 IST)

మహబూబ్ నగర్ లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్..

robbery
మహబూబ్ నగర్ లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బృందావన్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనానికి ఈ ముఠా యత్నించిందని, ఈ ఘటన ఆ ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిందని సమాచారం. 
 
నాలుగు రోజుల క్రితం ఇదే కాలనీలో మరో దోపిడీ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ బంగారం, నగదుచోరీకి గురయ్యాయని తెలుస్తోంది. పదేపదే జరుగుతున్న సంఘటనలు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.