బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (09:37 IST)

రష్యాపై ఉక్రెయిన్‌ సేనల దాడి.. 1000 మంది రిజర్విస్టులు మృతి

Russia-Ukraine war
రష్యాపై ఉక్రెయిన్‌ సేనలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా కీవ్‌ జరిపిన దాడుల్లో ఒక్కరోజే కనీసం 1000 మంది రిజర్విస్టులు మృతిచెందినట్లు ఉక్రెయిన్‌ రక్షణ వర్గాలు తెలిపాయి. 
 
యుద్ధక్షేత్రంలో తగులుతోన్న వరుస దెబ్బలతో సాధారణ పౌరులు, మాజీ ఖైదీలు, మాజీ సైనికులును రిజర్విస్టులుగా రష్యా తన దళాల్లోకి తీసుకుంటోంది. 
 
చాలామందికి సరైన శిక్షణ అందడం లేదని.. ఆయుధాలు లేవు. రష్యా అధికారుల ప్రకారం ప్రస్తుతం 41వేల మంది రిజర్విస్టులు ఉక్రెయిన్‌ దళాలతో పోరాడుతున్నారు. వీరిని లక్ష్యం చేసుకొని కీవ్‌ సేనలు దాడులు చేస్తున్నాయి.