శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (11:22 IST)

కరోనా కనుమరుగైందని అనుకుంటే.. కొత్తగా 4వేల కేసులు నమోదు

coronavirus
దేశంలో కరోనా కనుమరుగైందని అనుకుంటున్న వేళ.. కొత్తగా నాలుగు వేలకు పైగా కరోనా కేసులు నమోదైనాయి.  సోమవారం నాడు దేశవ్యాప్తంగా మొత్తం 4,129 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,45,72,243కు చేరింది.
 
అంతేగాకుండా 20 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,28,530కి చేరింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 0.10 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 98.72గా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.