గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated: మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (10:34 IST)

సంజూ సంజూ అంటూ గట్టిగా అరిచిన ఫ్యాన్స్.. కేరళ నిరసన.. ఎందుకు?

Sanju Samson
Sanju Samson
ఆస్ట్రేలియాతో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్‌.. ఇప్పడు దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమైంది. బుధవారం(సెప్టెంబర్‌ 28) తిరువనంతపురం వేదికగా జరగనున్న తొలి టీ20తో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది.
 
ఈ క్రమంలో ప్రోటీస్‌తో తొలి టీ20లో పాల్గొనేందుకు తిరువనంతపురంలో అడుగుపెట్టిన భారత జట్టుకు నిరసన సెగ తగిలింది. టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కని సంజూ శాంసన్‌కు మద్దతుగా అభిమానులు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. భారత క్రికెటర్లు ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు రాగానే సంజూ సంజూ అంటూ గట్టిగా నినాదాలు చేశారు.
 
కాగా సంజూకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అతడి సొంత రాష్ట్రం కేరళలో అయితే డై హార్ట్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను భారత కెప్టెన్‌ రోహిత్‌ పాటు చాహల్‌, అశ్విన్‌ తమ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు.