శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (14:49 IST)

కబడ్డీ ఆటగాళ్ళకు అవమానం.. బాత్రూమ్‌లో ఆహారం

srivari food
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కబడ్డీ ఆటగాళ్లకు వడ్డించే ఆహారాన్ని మరుగుదొడ్డిలో భద్రత పరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షహరాన్‌పూర్ జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో ఈ సంఘటన వెలుగు చూసింది. కబడ్డీ ఆటగాళ్ళ కోసం తయారు చేసిన వంటపాత్రలను బాత్రూమ్‌లో భద్రపరిచారు. ఇది ప్రతి ఒక్కరినీ షాకింగ్‌కు గురిచేసింది.
 
జాతీయ మీడియా కథనాల మేరకు.. ఇక్కడ జరిగే ఉమన్స్ కబడ్డీ టోర్నమెంట్‌లో దాదాపు 300 మంది ఆటగాళ్ళు పాల్గొన్నారు. వీరి కోసం సిద్ధం చేసిన వంట పాత్రలను బాత్రూమ్‌లో భద్రపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవవుతోంది. ఈ వంట పాత్రల నుంచి కొందరు ఆటగాళ్ళు ఆహారాన్ని తీసుకుంటున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. 
 
దీనిపై అధికారులు స్పందిస్తూ, స్టేడియంలో స్థలాభావం కారణంగా వంటపాత్రలను అక్కడ పెట్టాల్సివచ్చిందని నిర్లక్ష్యపూరితంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఈ వీడియోలు వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. క్రీడా అధికారి అనిమేష్ సక్సేనాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.