శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (16:08 IST)

ఈ న్యూట్రిషన్‌ మాసంలో గుండెకు ఆరోగ్యం అందించే ఆహారానికి సమ్మతి తెలపండి

Almonds
ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ను పౌష్టికాహార మాసం (న్యూట్రిషన్‌ మంత్‌) లేదంటే ‘పోషన్‌ మాహ్‌’గా నిర్వహిస్తుంటారు. పౌష్టికాహార మాసోత్సవం జరపడానికి ప్రధాన కారణం, పౌష్టికాహారం, శ్రేయస్సు, సంపద పట్ల అవగాహన కల్పించడం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఒక్క క్షణం ఆగి, తమ జీవనశైలి ఎంపికలను సమీక్షించుకోవాల్సిందిగా గుర్తు చేసే నెల ఇది. అదే సమయంలో  తమతో పాటుగా తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం అత్యంత కఠినమైన నిర్ణయాలనూ తీసుకోవాల్సిన ఆవశ్యకతను సైతం తెలుపుతుంది.

 
అధ్యయనాలు వెల్లడించేదాని ప్రకారం, భారతీయుల జన్యుపరమైన కారణాల కారణంగా గుండె వ్యాధుల బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఆ కారణం చేత, ఎన్నో భారతీయ గృహాలలో కార్డియోవాస్క్యులర్‌  వ్యాధులు అత్యంత తీవ్రమైన ఆరోగ్య ఆందోళనలుగా నిలుస్తున్నాయి. డైటరీ మరియు జీవనశైలి మార్పులు అత్యంత కీలకమైన మార్పులు అత్యంత కీలకమైన పాత్రను మార్పు పరంగా తీసుకురావడంతో పాటుగా అత్యుత్తమ గుండె ఆరోగ్యం కోసం రిస్క్‌ ఫ్యాక్టర్లను సైతం  తగ్గిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నూతన సాధారణత వేళ తమ  జీవనశైలి ప్రాధాన్యతలను ఎంచుకున్నప్పటికీ, తమ ఆరోగ్యం పట్ల ఆప్రమప్తంగా ఉండటం గతం కంటే మిన్నగా మారింది. దీనికి మొదటి అడుగుగా, అత్యుత్తమ గుండె ఆరోగ్యం చేరుకోవడం కోసం గుండెకు అనుకూలమైన ఆరోగ్య ప్రాధాన్యతలను ఎంచుకోవడం చేసుకోవాలి.

 
సమతుల ఆహారం తీసుకోవడం అనేది అతి సరళమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. ఇది గుండె వ్యాధుల ప్రమాదం తగ్గించడం మాత్రమే కాదు, ఒకరి ఆరోగ్య ఆందోళనలకు సైతం తగిన పరిష్కారాలను అందిస్తుంది. పౌష్టికాహారం తో ఒకరి ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం లేదా నిర్వహించడం సాధ్యమవుతుంది. ఈ పౌష్టికాహారంలో అత్యధిక పోషకాలు కలిగిన ఆహరం, తీసుకునే ఆహారంలో  నియంత్రణ వంటివి కూడా భాగంగా ఉంటాయి. సమతుల, పోషక విలువలు కలిగిన డైట్‌తో గుండె వ్యాధుల ప్రమాదం తగ్గడంతో పాటుగా కొలెస్ట్రాల్‌ స్థాయి కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇక్కడ మూడు అత్యున్నతమైన, గుండెకు ఆరోగ్యం అందించే ఆహారాలను గురించి వివరించడం జరిగింది. ఇవి గుండె ఆరోగ్యం మెరుగుపడటంలో సహాయపడతాయి.

 
బాదములు
ఓ గుప్పెడు బాదములను ఒకరి రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవడం చక్కటి ఆరంభం. వీటిలో విస్తృతశ్రేణిలో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ అవకాశంగా నిలపడంతో పాటుగా ప్రజల గుండె ఆరోగ్యానికీ తోడ్పడతాయి. బాదములలో 14 అత్యవసర పోషకాలు ఉంటాయి. అవి విటమిన్‌ ఈ, మెగ్నీషియం, ప్రొటీన్‌, రిబోఫ్లావిన్‌, జింక్‌ మొదలైనవి. పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం క్రమం తప్పకుండా బాదములు తినడం వల్ల ఎల్‌డీఎల్‌ మరియు టోటల్‌ కొలెస్ట్రాల్‌  తగ్గడంతో పాటుగా ఒకరి గుండె ఆరోగ్యానికి సైతం తోడ్పడుతుంది. అదనంగా, బాదములు మరియు కార్డియోవాస్క్యులర్‌ ఆరోగ్యంపై జరిగిన పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం ఆరోగ్యవంతమైన డైట్‌లో భాగంగా రోజూ బాదములు తింటే  డిస్లిపిడెమియా తగ్గుతుంది. భారతీయులలో  గుండె వ్యాధులకు అతి ముఖ్యమైన కారణమిది. అనారోగ్యకరమైన స్నాక్స్‌కు బదులుగా బాదములు తింటే, ఒకరి జీవితంలో ఆరోగ్యవంతమైన మార్పులను చూడవచ్చు. బాదములను తమకిష్టమైన రుచులలో సైతం మిళితం చేయడం ద్వారా రుచికరమైనప్పటికీ ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను కుటుంబమంతా ఆస్వాదించవచ్చు.

 
తృణధాన్యాలు
తృణధాన్యాలలో ప్రొటీన్స్‌, మినరల్స్‌, కాల్షియం, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, విటమిన్స్‌ ఉంటాయి. అధ్యయనాలు వెల్లడించే దాని  ప్రకారం,  తృణ ధాన్యాల కారణంగా కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. వీటిద్వారా టోటల్‌ కొలెస్ట్రాల్‌ 8% తగ్గుతుంది.  గోధుమలు, బియ్యంను అధికంగా తీసుకుంటున్నప్పటికీ తృణ ధాన్యాలైనటువంటి పెరల్‌ మిల్లెట్‌ (సజ్జలు), ఫాక్స్‌టైల్‌ మిల్లెట్‌ (కొర్ర), సోర్గమ్‌ (జొన్నలు), ఫింగర్‌ మిల్లెట్‌ (రాగులు) మొదలైనవి భారతదేశంలో నేడు లభిస్తోన్న ఆరోగ్యవంతమైన ఆహార పదార్ధాలుగా ఉన్నాయి. అతి సులభంగా వీటిని ఒకరి డైట్‌లో జోడించుకోవడానికి ఇడ్లీలు చేసుకోవచ్చు. బియ్యంకు బదులుగా రాగులు జోడించుకోవడం ద్వారా పౌష్టికాహార భోజనం  చేసుకోవచ్చు.

 
బెర్రీలు
బెర్రీలలో చక్కటి పౌష్టికాహార ప్రొఫైల్‌ ఉంది. వీటిలో ఫైబర్‌, విటమిన్‌ సీ, యాంటీ ఆక్సిడెంట్‌ పాలీఫినాల్స్‌ అధికంగా ఉంటాయి. ఈ ఫలితంగా బెర్రీలను ఒకరి డైట్‌లో  జోడించడం ద్వారా  ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలను నియంత్రించడం సాధ్యపడుతుంది.  అదనంగా, ఒకరు తమ డైట్‌లో స్ధానికంగా లభించే స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, రాస్ప్‌బెర్రీ, మల్‌బెర్రీ మొదలైనవి జోడించడం  ద్వారా పాలిపెనాల్స్‌ మరీ ముఖ్యంగా ఆంథోసియానిన్స్‌, మైక్రో న్యూట్రియంట్స్‌ మరియు ఫైబర్‌ జోడించవచ్చు. పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం, బెర్రీలతో కార్డియోవాస్క్యులర్‌ రిస్క్‌ ప్రొఫైల్స్‌ కూడా  మెరుగుపడతాయి. బెర్రీలతో గణనీయంగా ఎల్‌డీఎల్‌ ఆక్సిడేషన్‌, లిపిడ్‌ పెరాక్సిడేషన్‌, టోటల్‌ ప్లాస్మా యాంటీ ఆక్సిడెంట్‌ సామర్ధ్యం,డిస్లిపిడెమియా, గ్లూకోజ్‌ మెటబాలిజం కూడా మెరుగుపడతాయి.
 
-రితికా సమద్దార్‌, రీజనల్‌ హెడ్‌-డైటెటిక్స్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌, ఢిల్లీ.