సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

వరదల్లో దాయాది దేశం పాకిస్థాన్ : సాయంపై భారత్ మల్లగుల్లాలు

pak floods
దాయాది దేశం పాకిస్థాన్ వరదల్లో చిక్కుకుంది. గత మూడు దశబ్దాల్లో ఎన్నడూ చూడని వరధలు సంభవించాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌లోని సింధ్, బలూచిస్థాన్ రాష్ట్రాల్లో వరద నీటిలో చిక్కున్నాయి. ఈ వరదలల కారణంగా ఇప్పటివరకు దాదాపు వెయ్యి మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు కోట్ల మంది వరకు వరద బాధితులుగా మిగిలిపోయారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ పీకల్లో ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఇపుడు వరదలు సంభవించడంతో ఈ కష్టాలు మరింతగా ఎక్కువయ్యాయి. సింధ్, బలూచిస్థాన రాష్ట్రాలతో పాటు ఖైబర్ ఫఖ్తుంక్వా, గిల్గిట్ - బలూచిస్థాన్ రాష్ట్రాల్లో కూడా భారీ వరదల వల్ల తీవ్రంగా నష్టపోయాయి. 
 
పాకిస్థాన్‌లో నెలకొన్న దయనీయ పరిస్థితిని చూసిన భారత పాలకులు చలించిపోయారు. పాకిస్థాన్‌కు తగిన సాయం అందించేందుకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, పాకిస్థాన్‌ను వరద బాధిత దేశంగా భావించి సాయం చేయాలా వద్దా అనే అంశంపై ఇంకా ఓ స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. అదేసమయంలో పాక్‌లో సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాల సభ్యులకు ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.