గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated: మంగళవారం, 30 ఆగస్టు 2022 (16:31 IST)

భారత్ చేతిలో ఓడిపోవడానికి కారణం బాబర్ కెప్టెన్సీనే కారణం : వసీం అక్రమ్

wasim akram
ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఆదివారం కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ చివరి ఓవర్‌లో విజయాన్ని అందుకుంది. భారత ఆల్ ‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టును విజయతీరానికి చేర్చారు. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమికి ప్రధాన కారణం జట్టు కెప్టెన్ బాబర్ అజం కారణమని పాక్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టాస్ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన అజాం... తొలుత బ్యాట్‌తో రాణించలేకపోయాడనీ, ఆ తర్వాత ప్రత్యర్థి బ్యాటింగ్ వేళ కెప్టెన్సీ పరంగా కూడా ఆకట్టుకోలేక పోయాడని చెప్పారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్ళను ఔట్ చేసిన స్పిన్నర్ మహ్మద్ నవాజ్‌ను సరైన సమయాల్లో బౌలింగ్‌కు దించడంలో కెప్టెన్‌గా అజం పూర్తిగా విఫలమయ్యాడని అభిప్రాయపడ్డాడు. 
 
మిడిల్ ఓవర్‌లో కాకుండా, ఆఖరులో బౌలింగ్‌కు దింపడం అజం చేసిన పెద్ద తప్పిదాల్లో ఒకటని చెప్పారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజులో ఉన్నపుడు చివరి ఓవర్లలో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం సరైన నిర్ణయం కాదన్నాడు.