1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 జులై 2025 (10:10 IST)

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

vijay devarakonda - bhagyasri
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో పాటు 'కింగ్డమ్' చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆపై తితిదే అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
vijay devarakonda - bhagyasri
 
కాగా, శనివారం రాత్రి తరుపతిలో కింగ్డమ్ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో కథానాయికగా భాగ్య శ్రీ నటిస్తుండగా సత్యదేవ్ మరో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 31వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది.