శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (13:19 IST)

దుబాయ్ చేరిన టీమిండియా - పాక్ కెప్టెన్‌తో కోహ్లీ కరచాలనం!

kohli - babar
ఇంగ్లండ్, జింబాబ్వే దేశాల్లో తమ క్రికెట్ టూర్లను ముగించిన భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ క్రికెట్ టోర్నీ కోసం దుబాయ్‌కు చేరుకుంది. దుబాయ్‌లో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా అక్కడకు చేరుకుంది. 
 
అయితే జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌ కోసం జట్టుతో కలిశాడు. ఈ సందర్భంగా కోహ్లీ సహచర ఆటగాళ్ళతో ఉల్లాసంగా గడిపారు. అంతేకాకుండా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో కలిసి షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించాడు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.