శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (17:11 IST)

ఆసియా క్రికెట్ కప్ : భారత జట్టు ప్రకటన

team india
ఆసియా క్రికెట్ కప్ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టును భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జాతీయ సెలెక్టర్లు ప్రకటించారు. ఈ సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతారు. అలాగే, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకు తిరిగి జట్టులో చోటుకల్పించారు. 
 
గజ్జల్లో గాయం కారణంగా కొంతకాలం పాటు జట్టుకు దూరమైన రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకోవడంతో తిరిగి చోటు దక్కించుకోవడమే కాకుండా తిరిగి భారత జట్టు వైఎస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మొత్తం 15 మంది సభ్యులతో ఈ జట్టును ప్రకటించారు. వీరితో పాటు దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పెటేల్ తదితరులను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు. 
 
భారత జట్టు వివరాలు... 
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన, చాహల్, బిష్ణోయ్, భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్‌.