1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (15:38 IST)

ఆసియా కప్ నిర్వహణపై చేతులెత్తేసిన శ్రీలంక

cricket balls
ఆసియా కప్ నిర్వహణపై శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. దీంతో ఆసియా కప్ క్రికెట్ పోటీలను మరో దేశంలో నిర్వహించనున్నారు. ఇదే అంశంపై శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి మోహన్ డి సిల్వా మాట్లాడుతూ, తమ గడ్డపై ఆసియా క్రికెట్ పోటీలను నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితులు అందుకు అనుకూలించలేదన్నారు. తమ దేశంలో జరుగుతున్న అల్లర్లతో ఈ టోర్నమెంట్ జరిగేలా కనిపించడం లేదని ఆయన తెలిపారు. 
 
కాగా, ఈ ఆసియా క్రికెట్ కప్ పోటీలు ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబరు 11వ తేదీ వరకు శ్రీలంకలో జరగాల్సివుంది. కానీ ప్రస్తుతం ఆదేశంలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో భారత్‌లో నిర్వహించే అవకాశం ఉందని ఊహాగనాలు వస్తున్నాయి. అంతేకాకుండా, ఈ టోర్నీలో తమ దేశంలో నిర్వహించేలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు తేల్చి చెప్పింది. దీంతో ఈ పోటీలు యూఏఈలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.