బుధవారం, 10 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 డిశెంబరు 2025 (08:46 IST)

కారును ఢీకొన్న విమానం... వీడియో వైరల్

Flight
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ విమానం కారును ఢీకొట్టింది. రోడ్డుపై వెళుతున్న కారును వెనుక వైపు నుంచి ఈ విమానం ఢీకొట్టింది. సోమవారం రాత్రి బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్ స్టేట్ 95 జాతీయ రహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఆ కారను వెనుకభాగంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్‌, ప్రయాణికుడు ఉన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. వీరు సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.