తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?
తమలపాకులతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. వీటిలో ముఖ్యమైనవి ఏమిటో తెలుసుకుందాము. తమలపాకు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరచడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం అందించడానికి ఇది సాంప్రదాయకంగా ఉపయోగించబడుతుంది. కఫాన్ని పలచన చేసి ఉపశమనం కలిగిస్తుంది. తమలపాకు సహజంగా యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను తగ్గించి, చిగుళ్ల సమస్యలు, దంతక్షయం నుండి రక్షణ కల్పిస్తుంది.
తమలపాకులలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల చిన్నపాటి గాయాలను త్వరగా మానేలా చేయడంలో సహాయపడుతుంది. తమలపాకులో నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయని చెబుతారు, ముఖ్యంగా తలనొప్పి వంటి సమస్యలకు ఉపయోగపడుతుంది. అలసటను తగ్గించి, మానసిక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని నమ్ముతారు. జలుబు, దగ్గు తగ్గాలంటే 2 కప్పుల నీళ్ళలో 8 తమలపాకులు వేసి మరగపెట్టి ఆ కషాయం తాగితే ఫలితం వుంటుందని చెప్పబడింది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.