ఆదివారం, 10 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జులై 2022 (11:05 IST)

ప్యారిస్‌లో విహరిస్తున్న విరుష్క దంపతులు

kohli couple
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్కలు ప్యారిస్‌లో విహరిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టులో సభ్యుడైన విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, ఆయన మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన భార్యతో కలిసి ప్యారిస్‌లో చక్కర్లు కొడుతున్నారు. 
 
తన భార్య అనుష్క, కుమార్తె, వామికతో కలిసి ఆయన లండన్ నుంచి ప్యారిస్‌కు చేరుకున్నాడు. ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్‌స్టాఖాతా ద్వారా బహిర్గతం చేసింది. "హలో ప్యారిస్" అనే క్యాప్షన్‌తో హోటల్ గది ఫోటను ఆమె షేర్ చేశారు. క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చిన తర్వాత కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు ప్యారిస్‌కు ప్లాన్ చేశారు.