శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (13:01 IST)

కామన్వెల్త్ క్రీడలు.. భారత్‌కు ఐదో స్వర్ణం.. టేబుల్ టెన్నిస్‌లో..?

Table Tennis
Table Tennis
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఐదో స్వర్ణాన్ని సాధించింది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో సింగపూర్‌పై భారత్‌ 3-1తో విజయం సాధించింది. జి సత్యన్, హర్మీత్ దేశాయ్ తమ సింగిల్స్ మ్యాచ్‌లను గెలుపొందారు. అలాగే డబుల్స్ మ్యాచ్‌లోనూ గెలిచారు. దీంతో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చింది. ఫైనల్‌లో పురుషుల టీమ్ ఈవెంట్‌లలో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 
 
ఈవెంట్ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు ఫైనల్‌లోనూ శుభారంభం చేసింది. భారత్ తరపున, హర్మీత్ దేశాయ్, జి సత్యన్ జంట తమ డబుల్స్ మ్యాచ్‌ను 3-0తో గెలిచి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించారు.  
 
ఇకపోతే.. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 96 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన వికాస్ ఠాకూర్ రజతం సాధించాడు. అదే సమయంలో ఐదో రోజు మహిళల లాన్ బాల్స్ ఫైనల్లో టీమిండియా 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.