బుధవారం, 19 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 17 నవంబరు 2025 (22:13 IST)

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

Hijras poured petrol on themselves
ఈమధ్య హిజ్రాలు తెలంగాణ రాష్ట్రంలో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవలే ఓ బిల్డింగు నిర్మించుకున్న యజమానితో గొడవపడి అతడిని దారుణంగా కొట్టడంతో అతడు కేసు పెట్టాడు. ఐతే ఇప్పుడు తమపైనే మరో హిజ్రా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందంటూ 50 మందికి పైగా హిజ్రాలు హైదరాబాద్ బోరబండలో రోడ్డుపై నిరసనకు దిగారు. వారి నిరసనలను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
 
ఇంతలో తమకు న్యాయం చేయాలంటూ ముగ్గురు హిజ్రాలు ఒంటిపై పెట్రోలు పోసుకున్నారు. వారిని పోలీసులు సముదాయిస్తుండగానే గుబుక్కున అగ్గిపుల్ల గీసుకుని అంటించుకున్నారు. దాంతో ముగ్గురికీ మంటలు అంటుకుని ఆర్తనాదాలు చేసారు. రోడ్డుపై ఆ ముగ్గురికి అంటుకున్న మంటలు తమకు ఎక్కడ అంటుకుంటాయోనని అక్కడ వున్న ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీసారు. ఎలాగో మంటలు అదుపుచేసి తీవ్ర గాయాలపాలైన హిజ్రాలను మోతీనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.