గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (19:04 IST)

ఆసియా కప్‌.. పాక్‌తో వార్.. జిమ్‌లో కోహ్లీ వర్కౌట్స్.. వీడియో వైరల్

Kohli
Kohli
ఆసియా కప్‌ క్రికెట్ టోర్నీ ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చే భారత్‌- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఆగస్టు 28వ తేదీన జరుగనుంది. ఈ మ్యాచ్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కీలకం కానుంది. 
 
కోహ్లీకి ఇది వందో అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ కావడంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు బాదిన కోహ్లీ.. పాక్ తో జరిగే మ్యాచ్‌లో సెంచరీ బాదాలనుకుంటున్నాడు. కోహ్లీ తాజాగా షేర్ చేసిన వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. 
 
ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత జట్టుకు దూరమైన టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆసియా కప్‌-2022 టోర్నీ నేపథ్యంలో తిరిగి మైదానంలో దిగనున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌తో జట్టుతో కలవనున్నాడు. ఇందుకోసం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.