Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)
కార్తీక పౌర్ణమి సందర్భంగా సూపర్ మూన్ కనువిందు చేసింది. ఆకాశంలో చంద్రుడు సాధారణం కన్నా పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. చంద్రుడు ఇలా భూమికి సమీపంగా రావడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం విశేషం. వచ్చే నెల మరోసారి చంద్రుడు భూమికి దగ్గరగా రానున్నాడు.
వాస్తవానికి చంద్రుడు భూమి చుట్టు తిరిగే కక్ష్య అనేది పూర్తిగా వృత్తాకారంగా ఉండదు. కానీ కక్ష్యలో తిరిగే సమయంలో మాత్రం భూమికి చంద్రుడు దగ్గరగా వస్తుంటాడు, అలాగే దూరంగా వెళ్తుంటాడు.
అయితే పౌర్ణమి రోజున చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చిన వచ్చిన దృశ్యాన్నే సూపర్‌మూన్ అని పిలుస్తారు. ఆ సమయంలో భూమి నుంచి చంద్రుడు దాదాపు 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. దీనివల్ల సాధారణ పౌర్ణమి కన్నా 7 శాతం పెద్దదిగా ఉంటుంది.