శుక్రవారం, 7 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : గురువారం, 6 నవంబరు 2025 (14:10 IST)

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

NTR, hair stylist Ali Hakeem, Prashanth Neel
NTR, hair stylist Ali Hakeem, Prashanth Neel
ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమధ్య కొంత భాగాన్ని రామోజీ ఫిలింసిటీలో షూట్ జరిగింది. ఆ తర్వాత గత కాలం గేప్ తీసుకున్నారు. తాజాగా షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. దాని కోసం దర్శకుడు ఎన్.టి.ఆర్. హెయిల్ స్టెయిల్ ను దగ్గరుండి చక్కదిద్దేలా చేస్తున్నా ఫొటో పోస్ట్ చేశారు. 
 
తారక్, పై ఓ కొత్త లుక్ ను ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అలీ హకీమ్ తో ప్రిపేర్ చేస్తుండగా దీనిని దర్శకుడు ప్రశాంత్ నీల్ దగ్గరుండి మానిటర్ చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్. కొత్త లుక్ తో షెడ్యూల్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. సామాజిక అంశంతో మాస్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. భారీ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది రిలీజ్ కి తీసుకొస్తున్నారు.