శుక్రవారం, 7 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : గురువారం, 6 నవంబరు 2025 (13:59 IST)

Rajinikanth : ఇద్దరు ఐకాన్లు కలవబోతున్నారు తలైవా173 కు సుందర్ సి.ఫిక్స్

Kamal Haasan, Rajinikanth, Sundar C., R. Mahendran
Kamal Haasan, Rajinikanth, Sundar C., R. Mahendran
ఉలగనాయగన్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. తలైవా173 చిత్రానికి దర్శకత్వం సుందర్ సి చేయబోతున్నారు. ఇది పొంగల్ 2027 ఇది సినిమా, స్నేహం యొక్క వేడుకగా ఉండబోతోంది. రాజ్ కమల్ ఇంటర్ నేషనల్ బేనర్ పై రూపొందబోతోంది.
 
ఆర్. మహేంద్రన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 46 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ పునఃకలయిక కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. సుందర్ గతంలో విజయవంతమైన అరుణాచలం, పొందిన అన్బే శివం చిత్రాలకు దర్శకత్వం వహించారు.
 
దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో రజనీ నటించిన కూలీ చిత్రం విడుదలైన తర్వాత ఈ పునఃకలయిక గురించి వార్తలు మొదట వెలువడ్డాయి. సెప్టెంబర్ ప్రారంభంలో NEXA SIIMA అవార్డ్స్ 2025లో మాట్లాడుతూ, కమల్ హాసన్ ఈ వార్తను ధృవీకరించారు. మేము చాలా కాలం క్రితం కలిసి సినిమా చేయాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు సహకరించలేదు. మంచి కథాంశంతోకూడిన సమయం రావడంతో మేము కలిసి వచ్చాము.. అని ఆయన అన్నారు.
 
తరువాత, రజనీకాంత్ సెప్టెంబర్ 17న విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్ట్ ప్రణాళిక దశలో ఉందని అన్నారు. “మేము మంచి స్క్రిప్ట్‌ను లాక్ చేస్తే సినిమా ప్రారంభమవుతుంది. మేము దాని వైపు ప్లాన్ చేస్తున్నాము, కానీ మాకు మంచి కథ దొరుకుతుందని ఆశిస్తున్నాము” అని  అన్నారు.