గురువారం, 6 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2025 (21:24 IST)

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది చేయకండి..

Karthika pournami
Karthika pournami
కార్తీక పౌర్ణమి నవంబర్ 5, బుధవారం వచ్చింది. ఈ రోజున శివకేశవులను పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం వుండే వారికి కోటి పూజల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున పుణ్య తీర్థాల్లో స్నానమాచరించి.. వన భోజనాలు చేసినా.. ఉసిరి దీపాన్ని వెలిగించినా ఎన్నో రెట్లు ఫలితం వుంటుంది. కార్తీక పౌర్ణమి రోజున దీపదానం, అన్నదానం చేయడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. 
 
మట్టి దీపాలు లేదా పిండి దీపాలను వెలిగిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. పిండి దీపాలను వెలిగించాలనుకుంటే 5 లేదా 7 దీపాలను వెలిగించవచ్చు. కొబ్బరి దీపాన్ని కూడా ఈ దీపాలతో పాటుగా వెలిగించండి. కార్తీక పౌర్ణమి నాడు నారికేళ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. 
 
కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ఐదు నుంచి 9 గంటల్లోపు పూజ చేయడం మంచిది. రావి చెట్టు కింద దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. లేదా ఉసిరి చెట్టు కింద కూడా చేయవచ్చు. ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. 
 
365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు అగరవత్తులతో దీపం వెలిగించడం మంచిది. అగ్గిపుల్లను వాడకపోవడం మంచిది. కార్తీక పౌర్ణమి నాడు ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఈరోజు ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు.