గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?
Gowthami Chowdary Vs Dharma Mahesh
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరి వార్తల్లో నిలిచింది. భర్త, సినీ నటుడు ధర్మ మహేష్‌తో ఉన్న దాంపత్య వివాదం నేపథ్యంలో తాజాగా కూకట్‌పల్లి పీఎస్‌లో గౌతమిపై కేసు నమోదు అయింది. తన వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలను మీడియాలో పెడతానని బెదిరిస్తున్నారని, అలాగే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తూ మహేష్ ఫిర్యాదు చేశారు.
ఇంకా గౌతమి టీమ్ పది కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని మహేష్ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను గౌతమి ఖండించింది. తనపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది నిజమేనని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసు పెట్టారన్నారు. తాను అలాంటి కార్యకలాపాలకు పాల్పడలేదని తెలిపింది.
తనను వ్యక్తిగతంగా దిగజార్చడానికే ఇలాంటి ఫేక్ కేసులు పెడుతున్నారని ఆమె స్పష్టం చేసింది. తాను ఎవ్వరిని రూ. 10 కోట్లు అడగలేదని గౌతమి చౌదరి వెల్లడించింది.
ఇక భర్త ధర్మ మహేష్‌కి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరితో సహా వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ గౌతమి చౌదరి సాక్ష్యాలతో కూడిన వీడియోలు, చాటింగ్ స్క్రీన్‌షాట్‌లను మీడియాకు విడుదల చేశారు. దీనికి ప్రతిగా ధర్మ మహేష్ కూడా గౌతమిపై తీవ్ర ఆరోపణలు చేశారు.