గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 8 జనవరి 2026 (22:44 IST)

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

Soup
శీతాకాలంలో సాధ్యమైనంత వరకూ వేడివేడి వేడి ఆహారం తీసుకోండి. ఈ ఆహారంలో పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు వుండేట్లు చూసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి మసాలాలు తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చలికాలంలో చలి తీవ్రత వుంటుంది. దాహం కావడం లేదని నీళ్లు తాగడం మర్చిపోవద్దు. చలి ఉందని తక్కువ నీరు తాగకండి. గోరువెచ్చని నీరు మంచిది.
 
తగినంత వెచ్చని బట్టలు వేసుకోండి. తల, చెవులుపై చలిని ఆపే దుస్తులను కప్పుకోవాలి. చలికాలంలో మంచు అధికంగా వుంటుంది కనుక ఇంటి లోపలైనా సరే యోగా, స్ట్రెచింగ్ లేదా నడక చేయండి. శీతాకాలంలో చర్మం పొడిబారిపోకుండా నూనె లేదా మాయిశ్చరైజర్ వాడండి. రోజుకు కనీసం ఏడెనిమిది గంటల నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ సి వున్న నారింజ, ఉసిరి, నిమ్మకాయలు జలుబు నుండి రక్షిస్తాయి. శీతాకంలో ఆరోగ్య సంరక్షణకు ఇలా చిన్నచిన్న చిట్కాలు పాటిస్తుంటే సరిపోతుంది.