సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (11:55 IST)

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ చూసిన అంబానీ, సుందర్ పిచాయ్

Ravisastry
Ravisastry
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లు లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ చూశారు. హండ్రెడ్ కాంపిటీషన్ సెకండ్ ఎడిషన్ గేమ్స్ ప్రస్తుతం అక్కడ జరుగుతున్నారు. ఈ మ్యాచ్‌లకు సంబంధించి స్కై స్పోర్ట్స్ తరపున టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా వీరు ముగ్గురూ కలుసుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగారు. ఈ ఫొటోను రవి శాస్త్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "ఆగస్ట్ మాసంలో క్రికెట్ పుట్టినింట్లో (లండన్) క్రికెట్‌ని ఇష్టపడే ఇద్దరు వ్యక్తుల కంపెనీలో" అంటూ ఫొటోకు క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.