1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2022 (23:16 IST)

Indian Railways jobs 2022..1.4 లక్షల ఉద్యోగాలను భర్తీ

Jobs
నిరుద్యోగులకు కేంద్ర రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ రైల్వేలో 1.4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ వివరాలను వెల్లడించారు. 2014 నుంచి 2022 మధ్య భారత రైల్వేలో 3,50,204 మందికి ఉద్యోగం లభించిందన్నారు.
 
ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కొద్ది నెలల క్రితం ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగా 1.4 లక్షల ఉద్యోగాలు రైల్వేలో భర్తీ కానున్నట్లు చెప్పారు. ఈ ఒక్క ఏడాదే రైల్వేలో 18 వేల మందికి ఉపాధి అవకాశాన్ని కల్పించామన్నారు. రైల్వే అనేది భారీ సంస్థ అని అన్నారు.