గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (20:19 IST)

ఏపీలో 26,431 పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ నిర్ణయం

appolice
ఏపీలో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలిదశలో 6,500 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. మిగిలిన పోస్టులను దశలవారీగా భర్తీ చేయనున్నారు.
 
ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే సీఎం జగన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. 
 
ఇదిలా ఉంటే గత ఏడాది ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా దానిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 10వేల ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఐతే కేవలం 35 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.