1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
  4. Health Benefits of Black Pepper in Rainy Season

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Pepper
వర్షాకాలంలో నల్ల మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ మన ఆహారంలో నల్ల మిరియాలను చేర్చితే ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది. నల్ల మిరియాలు జలుబు, దగ్గును దరిచేరనివ్వవు. శ్వాస సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. 
 
నల్ల మిరియాల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని హానికర బ్యాక్టీరియా నుంచి కాపాడతాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. నల్ల మిరియాలకు సహజంగానే యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. 
 
ఇవి శరీరంలో వచ్చే వాపును, నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి. ఇది కీళ్ళు ఆరోగ్యంగా పని చేయడానికి దోహదపడుతుంది. శరీరంలోని కొవ్వును కరిగించే ప్రక్రియను నల్ల మిరియాలు వేగవంతం చేస్తాయి. జీవక్రియ చురుకుగా పని చేయడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీని వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక సహజ మార్గంగా ఉపయోగపడుతుం
తర్వాతి కథనం
చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..