మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)
సినీ నటి కల్పిక మళ్లీ వార్తల్లో నిలిచింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ రెసార్ట్స్‌లో ఆమె సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి హంగామా చేసింది. సిగరెట్స్ ఏది రా.. అంటూ రిసార్ట్స్ సిబ్బందిపై కల్పిక అరిచారు. కేవలం 40 నిమిషాల్లో రిసార్ట్స్ మొత్తాన్ని అల్లకల్లోలం చేసేంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రిసార్ట్స్ సిబ్బంది తనతో తప్పుగా ప్రవర్తించారని బుకాయించింది.
ఇప్పుడే కాదు.. గతంలో కూడా కల్పిక ఇలానే ఓ పబ్‌లో రచ్చ రచ్చ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల ప్రిజం పబ్‌లో నటి కల్పిక సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన చేసిందని పబ్ యజమాన్యం గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. నటి కల్పిక ఇటీవల తన బర్త్ డే సందర్భంగా ప్రిజం పబ్‌కు వెళ్లింది. అర్థరాత్రి వరకు ఉండి బర్త్ డే వేడుకలను ఫుల్‌గా ఎంజాయ్ చేసింది.
అనంతరం పబ్ ముగింపు సమయంలో డిజర్ట్ విషయంలో ఆమె అభ్యంతరం తెలిపింది. దీంతో కల్పికకు, పబ్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై పోలీస్ కేసు నమోదైంది.