అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?
అల్లంతో అనేక ప్రధాన ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఎందుకంటే అల్లంలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అల్లం ఎలాంటి అనారోగ్య సమస్యలను వదిలిస్తుందో తెలుసుకుందాము.
అల్లం రుచికి మాత్రమే కాదు, గొప్ప ఔషధం కూడా.
అల్లం, తేనె, పసుపు కలిపి పేస్ట్‌లా తయారు చేయండి.
గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తక్షణమే నయమవుతాయి.
తినడానికి ముందు, అల్లం ముక్క మీద నల్ల ఉప్పు చల్లుకుని తినండి.
ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది.
అల్లం టీలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.
ఇది జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అల్లం రసాన్ని కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే వాపు, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఈ అల్లం గృహవైద్యం ఆరోగ్యానికి ఒక వరం లాంటిది.