ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 11 మార్చి 2026 (19:29 IST)

Hansika: హన్సిక మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియాతో విడిపోయింది

Hansika Motwani, Sohail Kathuria
Hansika Motwani, Sohail Kathuria
దేశముదురు ఫేమ్ హన్సిక మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియాతో విడిపోయి విడాకులు తీసుకుందని బాలీవుడ్ కథనాలు స్పష్టం చేస్తున్నాయి. 2022లో విదేశంలో వివాహం చేసుకున్న హన్సిక కొద్దికాలానికి మనస్పర్థలు వచ్చాయని తెలిసింది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరి నాలుగేళ్ల వివాహ బంధానికి పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. హన్సిక భరణం తీసుకోకుండానే విడిపోయినట్లు సమాచారం.
 
ఇటీవల టీవీ షోలో పాల్గొన్న ఆమె చాలా సన్నబడినట్లు ఫేస్ లో ఏదో తెలీని బాధకనిపించినట్లుగా వుంటోంది. దీనిపై క్లారిటీ ఇవ్వకపోయినా ముంబై కోర్టులో కేసు నడుస్తుండగా తానేమీ చెప్పలేనని ఓ సందర్భంలో పేర్కొంది. కాగా, కుటుంబసభ్యులు వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దానికితోడు పెళ్లి ఫోటోలు సైతం హీరోయిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో డిలీట్ చేయడంతో డివోర్స్ రూమర్లకు మరింత బలం చేకూరింది.
 
బిజినెస్ మ్యాన్ సోహైల్ కతూరియాను హన్సిక డిసెంబర్ 4, 2022న వివాహం చేసుకున్నారు. హన్సిక తన తల్లితో కలిసి ఉండగా సోహైల్ సైతం విడిగా ఉన్నారు. ఇక సోహైల్‌కు ఇది రెండో పెళ్లి. తన చిన్న నాటి స్నేహితురాలు రింకీ బజాజ్‌ను ఆయన మొదట వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి హన్సిక కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రింకీ నుంచి సోహైల్ విడిపోయారు. ఆ తర్వాత హన్సికను రెండో వివాహం చేసుకోవడం విచిత్రం.