1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Ginger reduces muscle pain and menstrual cramps

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

ginger tea
అల్లం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే వంటకాల్లో కాస్తంత అల్లం ముక్కను తురిమి వేస్తుంటారు. ఈ అల్లం ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఒకటి. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మీ రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది.
అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి.
కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు.
వికారం, మార్నింగ్ సిక్నెస్ తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది.
అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.
పసుపు, అల్లం కలిపిన పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించాలి.
తర్వాతి కథనం
వేసవిలో చల్లచల్లగా కర్బూజ రసం తాగితే ఇవే ప్రయోజనాలు