Sri City Boiler Blast: శ్రీసిటీలో పేలుడు.. ఐదుగురు మృతి.. పదిమందికి గాయాలు (vide)
Sri City
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులలో గౌరబ్ రాయ్ (35), చిన్న మస్తాన్ (36), రమేష్ (40)లను అధికారులు గుర్తించారు. మరో మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. పేలుడులో తీవ్రంగా గాయపడిన వాసు (36), చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం.
అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారనే విషయం, పేలుడుకు గల కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు. బాయిలర్‌లో సాంకేతిక లోపం వల్ల ఈ పేలుడు సంభవించిందా లేక మరేదైనా కారణం ఉందా అని తెలుసుకోవడానికి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీ సిటీలోని ఒక ప్రైవేట్ కర్మాగారంలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కార్మికులు మరణించడం, పలువురు గాయపడటం అత్యంత విషాదకరమని పేర్కొన్న ఆయన, బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం సాధ్యమైనంత మేర అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు.
Five workers were killed after a boiler exploded at a private pharma company in Sri City, Satyavedu Mandal earlier today. AP Minister #NaraLokesh expressed deep shock, offered condolences to the bereaved families and directed officials to ensure the best medical care for the… pic.twitter.com/kyTDVYelJC
— Ashish (@KP_Aashish) October 3, 2026

