శుక్రవారం, 25 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 జులై 2025 (11:50 IST)

కాచిగూడ రైల్వే స్టేషనులో వాంతులు, ఇంటికెళ్లి సూసైడ్ చేసుకున్న మహిళా టెక్కీ

deadbody
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఒక మహిళా హాస్టల్‌లో మంగళవారం రాత్రి ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన 27 ఏళ్ల చింతల యామిని గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ మహిళా హాస్టల్‌లో వుంటోంది. ఐతే మంగళవారం నాడు తన సొంత ఊరుకి వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషనుకి వచ్చింది.
 
అక్కడ ఆమెకి వాంతులు అయినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె అక్కడి నుంచి వెనక్కి వచ్చేసింది. తన గదిలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. వాంతులు చేసుకున్నాక ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.