సోమవారం, 21 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 19 ఏప్రియల్ 2025 (18:45 IST)

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

Smita Sabharwal
కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli Lands) అంశంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ (Smita Sabharwal) ఎక్స్ వేదికగా రీట్వీట్ చేయడంపై గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసారు. పోలీసులు నోటీసులకు స్మిత స్పందిస్తూ విచారణకు హాజరయ్యారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు తెలిపారు. ఐతే తను ఎలాగైతే రీపోస్ట్ చేసానో అలాగే మరో 2 వేలమంది చేసారనీ, మరి వారి కూడా నోటీసులు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.
 
ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా పేర్కొంటూ... చట్టం అందరికీ సమానమేనా లేదంటే ఎంపిక చేసిన వారిని మాత్రమే లక్ష్యం చేసుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. కాగా కంచగచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదేనంటూ వైరల్ అయిన నకిలీ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నోటీసులు జారీ చేసారు పోలీసులు.