శుక్రవారం, 18 జులై 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జులై 2025 (22:28 IST)

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

Soap
Soap
కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగించడం సరైందా అని తెలుసుకోవాలంటే.. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఒకే సబ్బును వాడటం ద్వారా సమస్యలొస్తాయా అనేది తెలుసుకుందాం. మునుపటి కాలంలో అందరూ ఒకే సబ్బును ఉపయోగించుకునేవారు. కానీ అప్పుడు అది పెద్ద విషయంగా చూడలేదు. కానీ ప్రస్తుత కాలంలో ప్రజల మధ్య అవగాహన పెరిగింది. 
 
కాబట్టి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ తమను తాము ఇష్టపడే వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఇది మంచి ప్రక్రియయే అవుతుంది. ఒకే సబ్బును ఉపయోగించడం మంచిది కాదు. చర్మానికి తగినట్లు సబ్బులు వాడటం మంచిది. ఒకే సబ్బును అందరూ ఉపయోగించడం ద్వారా చర్మ సమస్యలు ఏర్పడే అవకాశం వుంది. ఒకరు ఉపయోగించిన సబ్బును వాడటం ద్వారా బ్యాక్టీరియా సులభంగా ఇతరులకు వ్యాపిస్తుంది. తద్వారా అలెర్జీలు తప్పవు. గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే అవకాశం వుంది. 
 
సబ్బులు ఎప్పుడూ తేమగా వుండే కారణంగా వాటిపై వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, క్రిములు వుంటాయి. వీటి ద్వారా సబ్బును ఉపయోగించే వారిలో చర్మ రుగ్మతలు తప్పవు. ఇంకా వ్యాధినిరోధక శక్తి తక్కువగా వున్న వారిలో ఈ చర్మ సమస్యలు సులభంగా వ్యాపిస్తాయి. ఇలాంటి సమస్యల నుంచి దూరం కావాలంటే.. ఒకరు ఉపయోగించిన సబ్బును మరొకరు ఉపయోగించే ముందు సబ్బును ఎండనివ్వాలి. 
 
తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా, పిల్లలైనా ఈ పద్ధతిని పాటించాలి. అలాగే ఒకే సబ్బును వాడకుండా వుండాలంటే.. లిక్విడ్ సబ్బులను ఉపయోగించాలి. సబ్బుల మాదిరిగా కాకుండా సోప్ లిక్విడ్స్ మార్కెట్లో అందుబాటులో వున్నాయి. వీటిని ఉపయోగించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉపయోగించుకోవచ్చు. 
 
అలాగే చర్మానికి తగినట్లు సబ్బులను, లిక్విడ్స్ వాడటం మంచిది. అలా వాడేముందు స్కిన్ డాక్టర్లను ఓసారి సంప్రదించడం మంచిది. సబ్బులను నేరు చర్మానికి రుద్దడం చేయకూడదు. చేతిలో రుద్దుకుని తర్వాతే చర్మానికి అప్లై చేయాలని స్కిన్ కేర్ నిపుణులు అంటున్నారు.