సంబంధిత వార్తలు
- మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!
- లావణ్య త్రిపాఠి నటిస్తున్న సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
- డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...
- మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ
- నేను చాలా గలీజ్... నేను ఇపుడే వస్తా : సీఐ శ్రీనివాస్ - లావణ్య ఫోను ముచ్చట్లు
Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)
Lavanya
హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులను కోకాపేటలోని ఇంట్లోకి రానిచ్చే వ్యవహారంపై లావణ్య పోలీసులను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్‌లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు లావణ్య. రాజ్‌తరుణ్ తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేశారని తన ఫిర్యాదులో లావణ్య ఆరోపించారు.
తనపై కుట్ర జరుగుతోందని.. రాజ్‌తరుణ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న లావణ్య.. రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రాజ్ తరుణ్‌తోపాటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు, శేఖర్ బాషా, ప్రీతీ సహా మరికొంత మందిపై ఫిర్యాదు చేశారు లావణ్య. తనకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం ఆమె నార్సంగి పోలీసులను ఆశ్రయించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి నిమిషం ప్రాణభయంతో బతుకుతున్నానని తెలిపింది. శుక్రవారం కూడా నలుగురు మహిళలు తన ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. తన ప్రాణం పోయాక వారిని పట్టించుకుంటారా అని పోలీసులను లావణ్య ప్రశ్నించారు.
రాజ్ తరుణ్, తాను కలిసి నాలుగేళ్ల క్రితం రూ.55 లక్షలు అప్పు తీసుకున్నాం. గొడవల కారణంగా వడ్డీ చెల్లించలేదు. అప్పు ఇచ్చిన వారు అడుగుతున్నారు. లేకుంటే ఇల్లు స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు.
వారం రోజులే గడువు. ఒకవేళ రాజ్ రూ.55 లక్షలు చెల్లించినా ఆ పాపర్టీ అతనికి ఇవ్వకూడదని.. అందుతో తన వాటా వుందని లావణ్య అన్నారు. ఇంత జరుగుతున్నా రాజ్ తనతో మాట్లాడట్లేదని లావణ్య తెలిపారు.
పోలీస్ స్టేషన్ ముందే నా ప్రాణాలు తీసుకుంటా : లావణ్య
— BIG TV Breaking News (@bigtvtelugu) April 19, 2025
నిన్న మళ్లీ మా ఇంటికి నలుగురు మహిళలు వచ్చారు
రాజ్ తరుణ్, శేఖర్ బాషా నాపై దాడి చేయిస్తున్నారు
పోలీసులు కూడా నాకు న్యాయం చేయడం లేదు
వాళ్లు ఎవరో నన్ను చంపే బదులు నేనే పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రాణాలు వదిలేస్తా
- లావణ్య pic.twitter.com/qkELyBNmwN
