గురువారం, 20 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (12:22 IST)

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

mastan sai lavanya
హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులోకి మస్తాన్ సాయి వచ్చాడు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. హీరో రాజ్ తరుణ్‌పై అనేక సంచలన ఆరోపణలు చేసిన లావణ్య.. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించింది. మస్తాన్ సాయి తనపై అత్యాచారం చేసి వీడియోలు తీశాడని, వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించింది. పైగా మస్తాన్ సాయిపై ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మస్తాన్ సాయిని అరెస్టు చేశారు. ఆ తర్వాత తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అనేక విషయాలను మస్తాన్ సాయి వెల్లడించినట్టు సమాచారం. 
 
అమ్మాయిల కోసమే డ్రగ్స్ పార్టీలను ఏర్పాటు చేశానని, వారికి డ్రగ్స్ ఇవ్వడం వల్ల మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం చెప్పినట్టు సమాచారం. ఆ వీడియోల ద్వారా వారినే బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు తీసుకునేవాడినని వెల్లడించాడు. అమ్మాయిల కోసం డ్రగ్స్‌ను బెంగుళూరు, గోవాల నుంచి తీసుకొచ్చేవాడిని, కానీ, ఆ డ్రగ్స్‌ను ఎవరికీ సరఫరా చేయలేదని చెప్పాడు. 
 
కేవలం అమ్మాయిల కోసం నిర్వహించే పార్టీల కోసమే వినియోగించానని చెప్పినట్టు సమాచారం. అలాగే, లావణ్యతో మస్తాన్ సాయికి ఉన్న సంబంధాన్ని కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నట్టు వినికిడి. ఆమెకు కూడా డ్రగ్స్ ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసినట్టు మస్తాన్ సాయి చెప్పాడనీ, కానీ, ఆమెను మాత్రం బలవంతం చేయలేదని, ఆమె అంగీకారంతోనే శారీరకంగా కలిసినట్టు వెల్లడించాడు. పైగా, పోలీసుల విచారణకు మస్తాన్ సాయి పూర్తిగా సహకరించడంతో ఈ సందర్భంగా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు.