1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Papaya dissolves cholesterol, and do you know how many other benefits it has?

కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Papaya
సీజనల్ ఫ్రూట్స్ తప్పక తింటుండాలి. ఏ సీజన్‌లో దొరికే పండును తింటుంటే అన్ని రకాల విటమిన్స్ అందుతాయి. ఇలాంటి పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. ఈ బొప్పాయిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. బొప్పాయి పండు ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ గృహవైద్యంగా పని చేస్తుంది. ఎలా అంటే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు భారీగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
 
ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైము బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల భోజనం తర్వాత నాలుగు బొప్పాయి ముక్కలు తింటే అది కడుపులో ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూస్తుంది. ఇది మాంసాన్ని కూడా త్వరగా అరిగేలా చేస్తుంది. బొప్పాయిలో ఎ, బి, సి, ఇ విటమిన్లతో పాటు ఖనిజాలు, ప్లేవనాయిడ్స్ వంటి మరెన్నో పోషకాలు ఉంటాయి. 
 
కొలెస్ట్రాల్‌ని తగ్గించడం ద్వారా ఇది గుండె జబ్బులను నివారిస్తుంది. ఇది నరాల బలహీనతలను తగ్గించే మంచి టానిక్ కూడా. క్యాల్షియం, పాస్ఫరస్ ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, గంధకం, క్లోరిన్ వంటి పోషకాలు తగు మోతాదులో ఉండటం వల్ల బొప్పాయి పలు శారీరక రుగ్మతలకు అడ్డుకట్ట వేయగలుగుతుంది. కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఎ, ఇలు కూడా బొప్పాయిలో ఉంటాయి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?