1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 29 జులై 2025 (14:44 IST)

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

Zebra saves baby monkey from wolves
ఓ కోతిపిల్ల ఆహారం కోసం వెతుకుతూ దారి తప్పింది. అంతే... దాన్ని ఆహారంగా భుజించేందుకు తోడేళ్లు వెంటబడ్డాయి. ఎలాగో వాటి నుంచి తప్పించుకుంటూ వచ్చి ఆ కోతిపిల్ల ఓ ముళ్ల పొదలపైకి ఎక్కి కూర్చుంది. ఐతే ఆ ముళ్ల పొదలను తోడేళ్లు చుట్టుముట్టాయి. ఆ పొదను ధ్వంసం చేసి ఎలాగైనా కోతిపిల్లను తమకు ఆహారం చేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. దీనితో భయపడిపోయిన కోతిపిల్ల ఆర్తనాదాలు చేయడం ప్రారంభించింది. ఈ అరుపులను విన్న జీబ్రా వెంటనే అటువైపు పరుగు పెడుతూ వచ్చింది.
 
కోతిపిల్ల వున్న పొద దగ్గరకు రాగానే ఆ కోతిపిల్ల వెంటనే జీబ్రా వీపు పైన ఎక్కి కూర్చుంది. దాంతో ఆ జీబ్రా కోతిపిల్లను తీసుకుని వేగంగా పరుగులు తీస్తుండగా దాని వీపు పైన వున్న కోతిపిల్లను ఎలాగైనా తినేయాలని తోడేళ్లు అనుసరించాయి. కానీ జీబ్రా వాటి ప్రయత్నాలను సఫలం కానీయలేదు. ఓ పెద్ద చెట్టు వద్దకు వెళ్లడంతో కోతిపిల్ల చటుక్కున ఓ కొమ్మ పైకి ఎగిరి కూర్చుంది. ఆ తర్వాత... తన ప్రాణాలను రక్షించిన జీబ్రాకు ఆప్యాయంగా ముద్దు పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.