Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)
పాములు పట్టుకునే వ్యక్తిగా మారారు సినీ నటుడు సోనూ సూద్. కరోనా టైమ్‌లో పేద ప్రజలకు ఆపద్భాంధవుడిగా మారిన సోనూసూద్.. ఆ తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వార్తల్లో నిలుస్తూ వున్నారు. తాజాగా సినిమాలపై పూర్తిగా దృష్టి సారించిన సోనూ సూద్.. పాములు పట్టే వ్యక్తిగా అవతారం ఎత్తారు.
పామును ధైర్యంగా పట్టుకుని.. దానికి సురక్షితంగా బ్యాగులో వేశారు. ఏ మాత్రం భయం లేకుండా పామును టాలెంట్‌గా పట్టుకుని.. దానిని సంచిలో బంధించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూసిన జనం మాత్రం ఇలాంటి సాహసాలు వద్దంటున్నారు. అభిమానులు ఈ వీడియోను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషపూరిత పాములను పట్టుకోవడం చేయొద్దని అంటున్నారు. అయితే మరికొందరు సోనూ విషం లేని పామునే అలా పట్టుకుని వుంటారని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.