పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధమైన సందిగ్ధం
Nihal, Priya Deshpaag
ప్రస్తుతం సందిగ్ధం సినిమాకి సంబంధించిన చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే వరుసగా అప్డేట్లను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ చిత్రానికి గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి నందన్ కృష్ణ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి, జీవ కోచెర్ల, నవీన్ రాజ్ సంకరపు, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగి, దుర్గ, శ్రీదేవీ, లక్ష్మణ్ రావు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
